ఆదోని మండలంలోని మండిగిరి గ్రామ పంచాయతీలో కోట్ల విలువచేసే 6. 51 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ప్రధాన నిందితుడు ఆముదాల భాస్కర్ ను శుక్రవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. భాస్కర్, చాకలి ఈరన్న నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆరుగురు అరెస్టు కాగా, ప్రధాన నిందితుడు భాస్కర్ ను 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు.