ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. బుధవారం తమ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారని తెలిపారు. భూమా శోభా నాగిరెడ్డి ట్రస్ట్ తరఫున రూ. 5 లక్షలను తాము విరాళంగా అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.