బనగానపల్లె పట్టణ పరిసర గ్రామాల్లో ఈ నెల 19వ తేదీన గురువారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ డిఈఈ ఎన్ మద్దిలేటి మంగళవారం తెలిపారు. బనగానపల్లె పట్టణ పలుకూరు, యనకండ్ల, కైప, ఇల్లూరు కొత్తపేట గ్రామాల్లో సబ్ స్టేషన్ల పరిధిలోగల రైతులకు, విద్యుత్ వినియోగదారులకు ఈనెల 19వ తేదీన గురువారం 132/33 కేవి సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 8 గంటల నుండి 11 గంటలకు విద్యుత్ అంతరాయం కలుగునన్నారు.