బనగానపల్లెలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

77చూసినవారు
బనగానపల్లెలో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
బనగానపల్లె మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల సమక్షంలో పూజారి ఆనంద ప్రసాద్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిగింది. సీతమ్మ తరపున నూకల విజయకుమార్, నూకల వాసంతి దంపతులు, శ్రీరాముడి తరపున సోమశేఖర్, స్వర్ణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్