నూతన మద్యం పాలసీ ప్రకారం రెండు సంవత్సరాల కాలానికి బేతంచర్ల మండలంలోని ఏడు దుకాణాలకు ఈనెల 9వ తేదీ లోపల ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డోన్ ఎక్సేంజ్ సీఐ బి వరలక్ష్మి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా పట్టణంలో నాలుగు గ్రామీణ ప్రాంతాల్లో మూడు మద్యం దుకాణాలకు రూ 2 లక్షలు డిపాజిట్లు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.