ప్యాపిలి పోలీసు స్టేషన్ పరిధిలో గల కలచట్ల గ్రామ సరిహద్దు వంకలో సారాయి బట్టిని నిర్వహిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం ప్యాపిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరామి రెడ్డి తన సిబ్బంది తో పాటు బయలు దేరి నాటుసారా బట్టి దగ్గరకు వెళ్లి దాడులు చేశారు. బట్టీ దగ్గరున్న 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి అక్కడున్న 5 లీటర్ల నాటు సారాను స్వాధీన పరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో తమ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.