డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకట రంగారెడ్డి జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను , మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు.