ఉగాది పండుగ సందర్భంగా మద్దిలేటి స్వామికి ప్రత్యేక పూజలు

79చూసినవారు
ఉగాది పండుగ సందర్భంగా మద్దిలేటి స్వామికి ప్రత్యేక పూజలు
బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం సమీపంలో వెలసిన మద్దిలేటిస్వామి ఆలయంలో ఉగాది వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఈవో రామాంజనేయులు, ఛైర్మన్ సీతారామచంద్రుడు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వేదపండితులు, అర్చక బృందాన్ని సత్కరించారు. కార్యక్రమంలో భక్తులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్