గూడూరు మండలంలోని కె. నాగులాపురం గ్రామంలో వెలసిన సుంకులా పరమేశ్వరీదేవి శుక్రవారం వరలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాసం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. అమ్మవారికి ఆలయ ఈవో, అర్చకులు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. భక్తులు 9 రకాల పిండి వంటలు, పుష్పాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.