కర్నూలు నగరపాలక సంస్థ, జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న వార్డు సచివాలయ కార్యదర్శుల బదిలీలకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. కర్నూలు నగరపాలక కౌన్సిల్ హాల్లో జరిగిన కౌన్సెలింగ్ ను కమిషనర్ రవీంద్రబాబు పరిశీలించారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఆర్డీఓ జునైద్, డీసీపీ సంధ్య, సూపరింటెండెంట్లు మంజూర్ బాషా, రమేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.