పౌష్టికాహారంతో తల్లి బిడ్డకు ఆరోగ్యం

53చూసినవారు
పౌష్టికాహారంతో తల్లి బిడ్డకు ఆరోగ్యం
గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకోవడం వలన తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని సిడిపిఓ నాగమణి అన్నారు. శుక్రవారం కోసిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ అయ్యమ్మ అధ్యక్షతన పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పౌష్టికాహారంపై గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న మొత్తం 69 అంగన్వాడి సెంటర్ల నుండి 69 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్