మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలో మంగళవారం నీటి సంఘం అధ్యక్షులు మరియు టీసీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నీటిసంఘం మండల డీసీసీ అధ్యక్షునిగా అనంతసేనారెడ్డి, ఉపాధ్యక్షులుగా అడివమ్మా గారి వెంకటరాముడు ఎన్నికయ్యారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి వారిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కోసిగి మండల నాయకులు, నీటిసంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.