కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తనను ఎవరూ ఓడించలేరని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించారు. సీఎం చంద్రబాబు చెప్పిన మోసపూరిత హామీలకు ప్రజలు లొగ్గకుండా తనను నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.