వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణకు చట్టబద్ధత కల్పించాలని నందికొట్కూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు గౌరీ ఈశ్వర్ నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని తన స్వగృహంలో వాల్మీకుల బోయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణకు చట్టబద్ధత సాధించుకునేంత వరకు వాల్మీకులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.