కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవకముందే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం వేసిందని సీపీఎం నగర నాయకులు ఏసు, నాగేష్, మౌలాలి, మధు అన్నారు. శుక్రవారం పెంచిన విద్యుత్ చార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ కల్లూరులోని షరీన్ నగర్ లో బిల్లులను దహనం చేశారు. విద్యుత్ చార్జీల పేరుతో రూ. 20 వేల కోట్లు ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతూ స్వర్ణాంధ్ర నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.