రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో న్యాయవాదుల పట్ల పోలీసులు అప్రజాస్వామ్య చర్యలను నిరసిస్తూ సోమవారం పత్తికొండలో న్యాయవాదులు ధర్నా చేశారు. ట్రాఫిక్ స్తంభించి రాకపోకలు నిలిచిపోయాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు కారప్ప మాట్లాడారు. అనంతపురం త్రీ టౌన్ పోలీసు అధికారులు సివిల్ వ్యవహారంలో కలుగజేసుకుని సీనియర్ న్యాయవాది బీవీ శేషాద్రి పట్ల అనుచితంగా ప్రవర్తించి బెదిరించారన్నారు.