నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో బుధవారం పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయలుదేరనున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకుని జలహారతిలో పాల్గొంటారు. శ్రీశైలం జల విద్యుత్పత్తి కేంద్రాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం. సుండిపెంట గ్రామంలో సాగు నీటి సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు పర్యటిస్తారు.