మహానంది క్షేత్రానికి రూ. 42 లక్షల ఆదాయం

50చూసినవారు
మహానంది క్షేత్రానికి రూ. 42 లక్షల ఆదాయం
ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని మహానంది క్షేత్రానికి తరలివచ్చిన కన్నడిగుల భక్తులతో రూ. 42, 24, 818 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నుండి 10వ తేదీ వరకు జరిగిన ఉత్సవాలను పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం నుంచి మహానంది క్షేత్రానికి లక్షలాది భక్తులు తరలివచ్చినట్లు తెలిపారు. దీంతో గత ఏడాది కన్నా సుమారు రూ. 10 లక్షల ఆదాయం సమకూరిందన్నారు.

సంబంధిత పోస్ట్