మహానంది పుణ్యక్షేత్రంలో నంద్యాల కలెక్టర్ ప్రత్యేక పూజలు

68చూసినవారు
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారిని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి దర్శించుకొని ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ ఈవో ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సత్కరించగా, వేదపండితులు వేద ఆశీర్వాదం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్