మహానంది పుణ్యక్షేత్రం వైభవంగా ప్రదోషకాల జలహారతులు

51చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో పరమ పవిత్రమైన కార్తీక సోమవారం సందర్భంగా ప్రదోషకాలంలో వైభవంగా జలహారతి పూజలు సోమవారం నిర్వహించారు. క్షేత్రంలోని నందితీర్థం(రుద్రగుండం)లో ఆలయ ఈవో. ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా జలహారతులు నిర్వహించారు. ముందుగా గంగాదేవికి షోడశోపచార పూజ చేసి గంగా అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం జల హారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్