నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని నల్లకాలువ గ్రామం సమీపంలో ఉన్న వైయస్సార్ స్మృతి వనంకి ఆదివారం సందర్శకుల తాకిడి నెలకొంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్మృతి వనంలోని వ్యూ టవర్, నక్షత్రవనం, పవిత్ర వనం తదితర వాటిని వీక్షించి మధురానుభూతి పొందారు. అదేవిధంగా అక్కడే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు.