రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం గోనెగండ్ల మండలం కుర్నూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. గ్రామాల్లోనే గ్రామ సభల్లో అధికారులందరూ పాల్గొని ప్రజల నుండి భూసమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరిస్తున్నారని తెలిపారు