అనంతసాగరం మండల కేంద్రంలో ఈనెల 28న నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వయంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొననున్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆత్మకూరు డిఎస్పి, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ తో ఆయన సమావేశం అయ్యారు. అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు.