ప్రజల సమస్యకు పరిష్కారం చూపిన సంఘం సీఐ

85చూసినవారు
ప్రజల సమస్యకు పరిష్కారం చూపిన సంఘం సీఐ
సంఘం సీఐ వేమారెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. సంఘం పట్టణంలోని కెనరా బ్యాంక్ సమీపంలో రహదారిపై వర్షపు నీరు చేరి దారుణమైన స్థితిలో ఉంది. ఈ మార్గాన వెళ్లడానికి ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విషయం సిఐ వేమారెడ్డికి తెలియడంతో ఆయన సోమవారం జెసిబి సహాయంతో దగ్గరుండి దారి పక్కనే కాలువ తీయించారు. తద్వారా నీటిని తొలగించారు. ఆయనకు పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్