సోమశిల జలాశయంలో ఎనిమిది టీఎంసీలు నీరు నిల్వ

62చూసినవారు
సోమశిల జలాశయంలో ఎనిమిది టీఎంసీలు నీరు నిల్వ
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుకుంటుంది. మంగళవారం ఉదయం ఆరు గంటల నాటికి అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలో 8. 013 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి 2456 క్యూసెక్కుల వరద నీరు వచ్చి జలాశయానికి చేరుతుంది. పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్