నెల్లూరు ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ కు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పర్యాటకశాఖ కందుల దుర్గేశ్ గురువారం వచ్చారు. వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రాం సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వెంకటగిరి గ్రామ దేవతగా కొలిచే ఈ జాతరకు భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.