ఆదురుపల్లిలో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

79చూసినవారు
చేజర్ల మండలం, ఆదురుపల్లిలో సీనియర్ టిడిపి నాయకులు చీర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బానసంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చీర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని, వాన రూపంలో వరుణదేవుడు కొత్త ప్రభుత్వానికి అక్షింతలతో ఆశీర్వదిస్తున్నాడని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్