వావిలేరులో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

73చూసినవారు
చేజర్ల మండలంలోని వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్