మాల్యాద్రి స్వామిని దర్శించుకున్న ఇంటూరి నాగేశ్వరరావు

564చూసినవారు
మాల్యాద్రి స్వామిని దర్శించుకున్న ఇంటూరి నాగేశ్వరరావు
వలేటివారిపాలెం మండలం మాలకొండలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కందుకూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి కృపతో కందుకూరులో, రాష్ట్రంలో టిడిపి కూటమి ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరావుతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్