కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడు రైతు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాకుమాను మాధవరావును, మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి మండలి చైర్మన్ డాక్టర్ దివి శివరాం మంగళవారం పరామర్శించారు. మాధవరావు నివాసానికి మాజీ ఎమ్మెల్యే చేరుకుని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేతో మండలి సభ్యులు పాలేటి కోటేశ్వర రావు, పులిచర్ల సుబ్బారెడ్డి, బూసి సురేష్, తోకల వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.