ఉలవపాడు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం జరగాల్సిన సమావేశానికి హాజరైన అధికారులకు ఎంపీపీతో సహా ప్రజాప్రతినిధులు ఊహించని షాక్ ఇచ్చారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని ఆరోపిస్తూ నిరసనగా ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం ప్రారంభించడానికి కోరం లేకపోవడంతో అధికారులు వేచి చూడాల్సి వచ్చింది.