కావలి టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోళ్లదిన్నె గ్రామం బాధితులు మాట్లాడారు. గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ ఫ్లెక్సీ కి అడ్డుగా వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయదలచారని, దానిని వారించినందుకు గ్రామంలో మాపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. గాయపడిన మేము చికిత్స పొందటం కోసం కావలి ఏరియా వైద్యశాలకు రావడం జరిగిందని, కత్తులు, కొడవళ్ళతో మాపైకి దాడికి రావడం జరిగిందన్నారు.