నెల్లూరు జిల్లా కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా టూటౌన్ పరిధిలోని పోలీసులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. మద్యం సేవించి లేదా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.