కావలి: మాజీ మంత్రిపై కేసు నమోదు

61చూసినవారు
కావలి: మాజీ మంత్రిపై కేసు నమోదు
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై బుధవారం కేసు నమోదయింది. బోగోలు మండలం కోలదిన్నె గ్రామంలో ఇటీవల వైసిపి- టిడిపి వర్గీయుల దాడిలో గాయపడి కావలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులును పరామర్శించేందుకు వెళ్లిన ఆయన పోలీసులపై అనుచితంగా మాట్లాడారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికీ పొదలకూరు, కావలి, వెంకటాచలం, ముత్తుకూరు ఆయనపై కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్