కావలి పట్టణంలోని ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద టిడిపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, డిఎస్పి శ్రీధర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి స్థానిక నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భారీగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.