కావలి పట్టణంలోని రైతు బజార్ లో ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయి. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు రోడ్లపైనే వాహనాలు నిలపడంతో అటుగా వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుంది. రైతు బజార్ వద్ద ఆక్రమించిన స్థలాలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆదేశాలతో మున్సిపల్, పోలీసు అధికారులు తొలగించి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ యధావిధిగా స్థలాలు ఆక్రమించి కూరగాయల విక్రయాలు జరుపుతుండడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.