కావలి: అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలి

70చూసినవారు
కావలి: అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలి
దగదర్తి మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల పక్షాన రాష్ట్ర టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు అధికారులను కలిశారు. అధికారులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అయినా ఇప్పటికీ అధికారుల్లో పనితీరు మెరుగుపడలేదని విచారం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారో తెలపాలని, ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్