కావలిలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం

51చూసినవారు
కావలిలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం
కావలి పట్టణంలోని 25వ వార్డులో శనివారం రాత్రి వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్