ఇసుక తరలింపునకు అనుమతులు లేవు: సెబ్ సీఐ

56చూసినవారు
ఇసుక తరలింపునకు అనుమతులు లేవు: సెబ్ సీఐ
ఇందుకూరుపేట మండలం పరిధిలోని నాగరాజు తోపు, పల్లిపాడు ఇసుక రీచ్ లతోపాటు మండలంలో ఎక్కడి నుంచి కూడా ఇసుక తరలింపు చేయరాదని ఇందుకూరుపేట సెబ్ సీఐ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఇసుక తరలింపునకు సంబంధించిన ఎటువంటి అనుమతులు అధికారకంగా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ప్రకటించే వరకు ఇసుక త్రవ్వకాలు చేయకూడదన్నారు. మండలంలో ఎవరైనా ఇసుక త్రవ్వకాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్