వరద బాధితుల సహాయార్థం 10 లక్షల చెక్కును టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి దంపతులు తమ వంతు సహాయంగా శుక్రవారం అందజేశారు. విజయవాడ లోని కలెక్టరేట్ లో ఎన్ బీకే సేవా సమితి తరపున కోటంరెడ్డి ఐదు లక్షలు, కోటంరెడ్డి సంధ్యా మరో ఐదులక్షలను మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ వారిని అభినందించారు.