నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహాలను లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు అర్హతలను పునఃపరిశీలించాలని అదనపు కమిషనర్ నందన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెప్మా విభాగం అధికారులు, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, నగరపాలక సంస్థ హౌసింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించారు.