కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల నెల్లూరు జిల్లాకు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటారని డిసిసి జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తెలిపారు. కోవూరు నియోజకవర్గం బైపాస్ దగ్గర నుంచి ఇనమడుగు సెంటర్ మీదుగా ఆత్మకూరు బస్టాండు ఇందిరా భవన్ వరకు ప్రదర్శన ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.