కార్పొరేటర్ గా గెలిపిస్తే.. వెన్నుపోటు పొడిచారు: అనిల్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక పెయింటర్ ను, ఒక ఉప్పు అమ్ముకునే వారిని, సాధారణ వ్యక్తులను కార్పొరేటర్లుగా చేశామని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని ఎంసీఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క రూపాయి లేకుండా కార్పొరేటర్లను గెలిపిస్తే నేడు కొందరు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు.