నెల్లూరు జిల్లాలోని అపాచీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దొరవారిసత్రం వద్ద ప్రముఖ పరిశ్రమ అపాచీ బస్సు మంగళవారం ఉదయం అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సురక్షితంగా ప్రయాణికులను పరిశ్రమకు చేర్చారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని సమాచారం.