నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30 డివిజన్ శ్రామిక నగర్ కు చెందిన మైనార్టీ నేత ఖాసిం ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం 50 మంది రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీలో తగు గౌరవం ప్రాధాన్యత ఇస్తామన్నారు.