ఉగాది సందర్భంగా వేదగిరిలో ప్రత్యేక పూజలు

83చూసినవారు
ఉగాది సందర్భంగా వేదగిరిలో ప్రత్యేక పూజలు
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో మంగళవారం ఉగాది పండుగ శ్రీ క్రోథి నామ సంవత్సర సందర్బంగా విశేష అలంకారం, విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం విశేష కల్యాణం, అనంతరం గిరి ప్రదక్షిణ ఉత్సవం కార్యక్రమాలు ప్రధాన అర్చకులు శ్రీ భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో సాగాయి. ఈవో గిరి కృష్ణ, చైర్మన్ వేమిరెడ్డి సురేంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్