నెల్లూరు గ్రామీణ మండలం ఎల్లంటి గ్రామానికి చెందిన బి. నాగయ్య అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం పొదలకూరు మండలం బత్తులపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చిన అతను రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి నెల్లూరు లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.