పొదలకూరు: సినిమా హాల్లో నాసిరకంగా తినుబండారాలు

67చూసినవారు
పొదలకూరు: సినిమా హాల్లో నాసిరకంగా తినుబండారాలు
పొదలకూరు పట్టణ పరిధిలోని ఒక థియేటర్లో నాసిరకరమైన తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలువాయి మండలానికి చెందిన కొందరు సినిమా వీక్షించేందుకు ఆదివారం మధ్యాహ్నం థియేటర్ కు వచ్చారు. విరామ సమయంలో సమోసాలు, కూల్ కేకులు, ఎగ్ ఫప్ లు కొనుగోలు చేశారు. నాసిరకరమైనవి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వాపోయారు. అవి బాగా లేకపోవడంతో పలువురిని నిలదీశారు.

సంబంధిత పోస్ట్