డయేరియా వ్యాధి పై ప్రజలకు అవగాహన

53చూసినవారు
డయేరియా వ్యాధి పై ప్రజలకు అవగాహన
ఉదయగిరి మండలం వడ్డెపాలెం గ్రామంలో సోమవారం డయేరియా వ్యాధిపై పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, అంగన్వాడీ కార్యకర్త వెంకటమ్మ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చుట్టూ ఉన్న మురికి గుంటల వల్ల దోమలు వ్యాప్తి చెంది డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కువగా నీటిని నిల్వ చేయకూడదన్నారు. డయేరియా వ్యాధి సోకిన వారిని గుర్తించడం, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్