సిద్దేశ్వరానికి భక్తుల తాకిడి

75చూసినవారు
సిద్దేశ్వరానికి భక్తుల తాకిడి
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఘటిక సిద్దేశ్వరం లో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇష్టకామేశ్వరి అమ్మవారిని మొదటి రోజు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. చుట్టూ దట్టమైన అడవి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో సిద్దేశ్వరానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. భక్తుల భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్